Good-News-For-Non-Resident-Indians

ప్రపంచవ్యాప్తంగా.. 3కోట్ల 10 లక్షల మంది ఎన్నారైలకు..

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మొత్తం 31 మిలియన్ల మంది(3కోట్ల10లక్షలు) ప్రవాసీలు వివిధ దేశాల్లో నివసిస్తున్నారు. వారిని భారత ప్రభుత్వం జన్మత: భారతీయులుగానే పరిగణిస్తోంది. ఈ కారణంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వారికి కూడా ఓటు వేసే అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అంతకుముందు సుప్రీం కోర్టు కూడా ప్రవాసీలకు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశమివ్వాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం 3కోట్ల 10 లక్షల మందిలో అర్హులైన వారిని తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఓటరుగా నమోదు చేసుకున్న వారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయనున్నారని ఎన్నికల సంఘం పేర్కొంది.