:: Welcome to NRI - Article ::

మసీదుకు ప్రార్థనలకోసం వెళ్లింది.. తిరిగి రాలేదంటూ

వాషింగ్టన్: రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న అమ్మాయి, తన స్నేహితురాలందరితో కలిసి ప్రార్థన చేసుకునేందుకు మసీదుకు వెళ్లింది. వెళ్లోస్తానంటూ తల్లితో చెప్పి, బయలుదేరిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. డల్లాస్‌లో చదువుకుంటున్న ఆ అమ్మాయి పేరు నబ్రా(17), అని పోలీసులు తెలిపారు. అల్ డల్లాస్ ఏరియా ముస్లీం సోసైటీ తెలిపిన వివరాల ప్రకారం నబ్రా కుటుంబం డల్లాస్‌లో నివసిస్తోంది. ఆమె స్థానిక హైస్కూల్లో చదువుకుంటోంది. రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న ఆమె 30 రోజులు స్కూల్‌కి సెలవు పెట్టింది. శనివారం సాయంత్రం తన స్నేహితురాళ్లతో కలిసి భోజనం ముగించుకుని ప్రార్థనల్లో పాల్గొనేందుకు మసీదుకు వెళ్లింది. అంతలో కొంతమంది మోటార్‌సైకిళ్లపై అక్కడికి చేరుకున్నారు. నబ్రాను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.

డార్విన్ మార్టిజ్(22) అనే యువకుడు మరికొంతమంది నబ్రాను కిడ్నాప్ చేశారని పోలీసులు గుర్తించారు. ఆ యువకుడిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత ఆమెపై లైంగికదాడి చేసి, చంపేశారని వారు తెలిపారు. ఆదివారం ఉదయం ఆమె శవాన్ని ఆ మసీదు దగ్గరే పడేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే ముస్లీం కమ్యూనిటీ నబ్రా హత్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మతంలో పుట్టడమే  తాము చేసిన నేరమా అని వారు  ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచి తమ వర్గం ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోందని వారు అన్నారు. ఇది జాత్యాహంకార హత్యేనని వారు తెలిపారు. నిందితులను శిక్షించాలని కోరుతున్నారు.