Girl-dies-after-fall-from-Abu-Dhabi-building

భవనం పైనుంచి పడి బాలిక మృతి..

అబుదాబి: విషాదకరమైన ఓ ఘటన జరిగింది. తల్లీతండ్రులకు ముద్దులొలికే మాటలు చెప్పాల్సిన మూడేళ్ల వయసున్న ఓ బాలిక ఎత్తైన భవంతి పైనుంచి పడి మృతి చెందింది. 12వ అంతస్తు పైనుంచి పడి బాలిక కన్నుమూసింది. ఖలీదియా ప్రాంతంలో ఈ విషాదం జరిగింది. తెరచివున్న కిటికీకి ఇంట్లోని ఫర్నీచర్ దగ్గరగా ఉంది. పెద్దవాళ్లు పనిలో ఉండగా ఫర్నీచర్‌పై ఆడకుంటున్న బాలిక ప్రమాదవశాత్తూ కిటికీ నుంచి కిందిపడిందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావమైన బాలిక అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. చిన్నపిల్లల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచనలిస్తున్నా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని అధికారి అల్ నియాది తెలిపారు. బాలిక మృతితో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. విషాదకరమైన ఈ ఘటన యూఏఈలోని అబుదాబి నగరంలో జరిగింది.