gandhi-150-th-birth-celebrations-at-indian-consulate-in-dubai

దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌లో గాంధీ జయంతి వేడుకలు

దుబాయ్: మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకలను రెండేళ్లపాటు నిర్వహించనున్నామని దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం ప్రకటించింది. ఈ అక్టోబర్ 2న జరగనున్న మహాత్మ గాంధీ 149వ జయంతి సందర్భంగా వేడుకలు మొదలుకానున్నాయని దుబాయ్ కాన్సుల్ జనరల్ విపుల్ బుధవారం ప్రకటించారు. వేడుకల్లో భాగంగా చర్చలు, క్విజ్ పోటీలు, ఉపన్యాసాలు, ప్రదర్శనలు, పలు చిత్రాలను ప్రదర్శించనున్నామని ఆయన పేర్కొన్నారు. యూఏఈలో జాయేద్-గాంధీ మ్యూజియాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ వేడుకలను ఉచితంగా చూడవచ్చునని, www.rajayogacenter.org ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని విపుల్ వివరాలను వెల్లడించారు.