:: Welcome to NRI - Article ::

చౌకగా విదేశీ ప్రయాణాలు

ఐఆర్‌సీటీసీ ద్వారా ప్రత్యేక ప్యాకేజీలు

తక్కువ ధరలకే  ప్రయాణ చార్జీలు
ఐఆర్‌సీటీసీ జాయింట్‌ మేనేజర్‌ సంజీవయ్య

కరీంనగర్, కొత్తపల్లి : ఇండియ్‌ రైల్వే టూరిజం లిమిటెడ్‌ ద్వారా తక్కువ ప్రయాణ చార్జీలతో విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌) జనరల్‌ మేనేజర్‌ సంజీవయ్య తెలిపారు. గురువారం కరీంనగర్‌  రైల్వేస్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 5 నుంచి 25 వరకు ప్రజలకు పర్యాటక రంగంపై అవగాహన కల్పించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. మన దేశంలో టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేసి, సందర్శకులను పెంచాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రజలు ఐఆర్‌సీటీసీ ద్వారా ఎటువంటి ప్యాకేజీనైనా పొందవచ్చన్నారు. రైల్వే, విమానం, బస్‌ అన్ని రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సీజన్‌ ప్రకా రం కూడా ఈ ప్యాకేజీలను నడిపిస్తున్నామని తెలిపారు. ప్రతి ప్యాకేజీ హైదరాబద్‌ నుంచి ప్రారంభమవుతుందన్నారు.
 
  • పూరి, భవనేశ్వర్‌లోని కొణార్క్‌ టెంపుల్‌లో ప్రస్తుతం డ్యాన్స్‌ ఫెస్టివల్‌ నడుస్తోందని, దానికి ప్రత్యేక ప్యాకేజీ 17,033 రూపాయలు ఉంటుందని  తెలిపారు. 
  • నవంబర్‌ నుంచి గుజరాత్‌కు 24,828 రూపాయల ప్యాకేజీ ప్రారంభమవుతుందన్నారు.
  • గోవాకు 16,854 రూపాయల ప్యాకేజీ ఉంటుందన్నారు. ఇందులో భాగంగా మూడు రాత్రు లు, నాలుగు రోజులు సౌత్‌ గోవా, నార్త్‌ గోవాలో పర్యటించవచ్చని తెలిపారు.  
  • తిరుపతికి 10,135 రూపాయల ప్యాకేజీ ఉందన్నారు. ఈ ప్యాకేజీ కింద త్రిస్టార్‌ హోటల్‌ సౌకర్యం, తిరుమల, శ్రీకళహస్తి, కాణిపాకం దర్శనాలను ఐఆర్‌టీసీ వారే చేయిస్తారని తెలిపారు.  తిరుపతిలో దిగిన తరువాత ఐఆర్‌టీసీ వారు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తారన్నారు. ఇందుకు గాను 884 రూపాయలు చెల్లించి ముందస్తు బుకింగ్‌ చేసుకోవలసి ఉంటుందని తెలిపారు. ట్రాన్స్‌పోర్టు, దర్శనం, తిరుచనూర్‌ చూపించి, దర్శనం చేయిస్తారన్నారు.
  • జనవరి 26న దుబాయికి ప్రత్యేక ప్యాకేజి ఉందన్నారు. ఇందుకు గాను 59,814 రూపాయలు చార్జీ ఉంటుందని తెలిపారు.. మూడు రాత్రులు, నాలుగు రోజుల ప్రయాణంలో దుబాయి, అబుదామి సందర్శించడంతో పాటు త్రీస్టార్‌ హోటల్‌ సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు.
శబరిమలైకి ప్రత్యేకం..
ప్రస్తుతం అయ్యప్ప భక్తులకు ప్రత్యేకంగా ఐఆర్‌టీసీ ద్వారా అతి తక్కువ ధరలో ప్యాకేజీలు ఉన్నాయని తెలిపారు. నవంబర్‌ 17, 24, డిసెంబర్‌ 1, 8, 22, 30, జనవరి 5, 12 తేదీల్లో ప్రయాణికులు బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్యాకేజీలో 15,545 రూపాయలకు ఫ్లైట్‌ టికెట్‌, ఏసీ హోటల్‌ అకామిడేషన్‌, ఏసీ రోడ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌, ఫుడ్‌ సర్వీస్‌, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటాయని తెలిపారు.  రెండు రాత్రులు, మూడు రోజులకు గాను కొచ్చిన్‌, శబరిమలై, గురువయూర్‌లు సందర్శించవచ్చని పేర్కొన్నారు. ప్రయాణికులు హైదరాబా్‌లోని 040-27702407, 9701360701, కరీంనగర్‌లో ఏసీ ట్రాన్స్‌పోర్టు 8099709899 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు. లేదా www.irctctourism.comలో బుక్‌ చేసుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ప్యాకేజీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేనేజర్‌ ప్రసన్న, ఎగ్జిక్యూటివ్‌ పవన్‌, ఏజెంట్‌ గిరి తదితరులు పాల్గొన్నారు.