forcible-marriage-at-age-of-fifteen--

15 ఏళ్ల వయసులోనే బలవంతపు పెళ్లి చేశారని..

లండన్: యూకేకు చెందిన బ్యూటీ క్వీన్ రూబీ మేరీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తాను 15 ఏళ్ల వయసులో ఉన్నపుడు తల్లిదండ్రులు తనను బంగ్లాదేశ్ కు తీసుకువెళ్లారని రూబీ మేరీ వెల్లడించారు. బంగ్లాదేశ్ దేశంలో తల్లిదండ్రులే తనకు ఇష్టం లేకుండానే తన కంటే రెట్టింపు వయసున్న వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేశారని రూబీ పేర్కొన్నారు. పెళ్లి అనంతరం తన భర్త తనపై ప్రతీరోజూ అత్యాచారం చేశాడని రూబీ వెల్లడించింది. తాను గర్భం దాల్చగానే తాను యూకేకు తిరిగివెళ్లానని, దీంతో తాను నరకం నుంచి బయటపడ్డానని రూబీ చెప్పింది. యూకేలో తనకు ప్రసవం అయిందని రూబీ వివరించింది.రూబీ చివరకు 2017 లో మిస్  గాలక్సీ టైటిల్ గెలుచుకుంది  ప్రస్తుతం మిస్ యునైటెడ్ కింగ్‌డ‌మ్ ఎర్త్  టైటిల్ పొందింది.