flight-services-starts-from-Hyd-to-

హైదరాబాద్‌- ఢిల్లీ మధ్య ఎయిర్‌ఏషియా విమాన సేవలు

హైదరాబాద్‌ : నెట్‌వర్క్‌ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌, ఢిల్లీ మధ్య ఎయిర్‌ ఏషియా ఇండియా విమాన సేవలను ప్రారంభించింది. విమానం ఢిల్లీలో ఉదయం 6.05 గంటలకు బయలదేరి 8.15 గంటలకు హైదరాబాద్‌ చేరుతుంది. హైదరాబాద్‌లో 8.45 గంటలకు బయలుదేరి ఢిల్లీకి 11 గంటలకు చేరుతుందని ఎయిర్‌ఏషియా తెలిపింది. అలానే మరో ఫ్లైట్‌ సాయంత్రం ఢిల్లీలో 17.50 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు 20.00 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌లో 20.25 గంటలకు బయలుదేరి ఢిల్లీకి 22.25 గంటలకు చేరుతుంది. ఢిల్లీ, హైదరాబాద్‌ల మధ్య సేవలను ప్రారంభించడంతోపాటు ఢిల్లీ నుంచి శ్రీనగర్‌, పుణేలకు అదనపు ఫ్లైట్లను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌ఏషియా ఇండియా ఎండీ, సీఈఓ సునీల్‌ భాస్కరన్‌ తెలిపారు. కొత్త సేవలకు సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి ఫ్లైట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఇటీవలే చెన్నై, హైదరాబాద్‌ మధ్య ఎయిర్‌ఏషియా ఫ్లైట్లను ప్రారంభించింది.