:: Welcome to NRI - Article ::

ఈ సౌదీ బ్రదర్స్.. రెండో తల్లికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు

రియాధ్: ముస్లిం మత ఆచారాల ప్రకారం బహుభార్యత్వం నేరం కాదన్న సంగతి తెలిసిందే. సౌదీలో ఈ విధానాన్ని పాటించే వారే ఎక్కువగా ఉంటారు. పెళ్లయిన నాలుగేళ్లో, అయిదేళ్లో అయితే ఏం ఫరవాలేదు కానీ.. ఏకంగా పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు కుమారులను ఇంట్లో ఉంచుకుని మరీ ఓ సౌదీ పౌరుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా రాబోయే తమ రెండో తల్లికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. గిఫ్ట్ కొన్నారు. ఇంటిని బాగా అలంకరించారు. ‘మా నాన్న ఈమెను వదిలేసి మరొకరిని పెళ్లాడినా సరే.. ఈ అమ్మను మాత్రం మేం వదిలిపెట్టం’ అని చెబుతున్నారు కూడా. వీరి హంగామా మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు. ఇదే వీడియో సౌదీ వ్యాప్తంగా.. ట్విటర్లో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.