father-doing-prostitution-with-his-daughter-

ఓ తండ్రి కన్నకూతుళ్లతో వ్యభిచారం చేయిస్తూ..

దుబాయ్: ఓ తండ్రిగా పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాల్సింది పోయి వారినుపయోగించుకుని డబ్బు సంపాదించాలనుకున్నాడు. దుబాయ్‌కి వలసదారుడిగా వచ్చిన అతడు కన్నకూతుళ్లతోనే వ్యభిచారం చేయిస్తున్నాడు. అలా భారీ మొత్తంలో డబ్బు సంపాదించి తన దేశానికి వెళ్లి బాగా సెటిల్ అవ్వాలనుకున్నాడు. కానీ, అతడు అనుకున్నదొక్కటి అయింది మాత్రం మరోకటి అతడు చేసిన దారుణాల గురించి కూతుళ్లు పోలీసులకు వివరించారు. అతడికి 10 మంది కూతుళ్లు, ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. దుబాయ్ వచ్చిన కొంతకాలానికి 18 ఏళ్లు నిండిన ఇద్దరు పెద్ద అమ్మాయిలను దుబాయ్ రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు. కొద్ది రోజుల గడిచిన తర్వాత అమ్మాయిలందరినీ దుబాయ్ రప్పించాడు. వారిని నైట్ క్లబ్‌లలో డ్యాన్స్ చేయడానికి తీసుకెళ్లేవాడు. క్రమంగా వారితో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టాడు. చెప్పినట్లు వినకపోతే తిండి పెట్టకుండా చిత్ర హింసలు పెట్టేవాడు. దాంతో కూతుళ్లందరూ తండ్రి చెప్పినట్లే  చేసేవారు. అయితే ఓ రోజు తమ దేశానికి చెందిన వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు. అతడికి కూతుళ్లు అన్ని విషయాలు చెప్పారు. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. తమ తండ్రి తమతో వ్యభిచారం చేయిస్తున్నాడని ఒక్క రాత్రికి 200 దిర్హమ్స్(రూ.3400), 300 దిర్హమ్స్(రూ.5200) వసూలు చేస్తుంటాడని కూతుళ్లు పోలీసులకు చెప్పారు. పోలీసులు తండ్రిని కోర్టులో హజరుపరిచారు. కోర్టు కేసును జనవరి 24 వాయిదా వేసింది.