father-died-after-saving-his-two-daughters

విషాదం.. కూతుళ్లను రక్షించి ప్రాణాలు వదిలిన తండ్రి

 రియాద్: స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోతున్న ఇద్దరు కూతుళ్లను రక్షించిన ఓ తండ్రి విషాదకర రీతిలో మృతి చెందిన ఘటన సౌదీఅరేబియాలో వెలుగులోకి వచ్చింది. అహ్మద్ అలీ జౌబ్రాన్ షరహిలి అనే వ్యక్తి తన కొడుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించాడు. అయితే వేడుకలు నిర్వహిస్తున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోతున్న ఇద్దరు కూతుళ్లను చూసిన అహ్మద్‌ స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి ఇద్దరినీ రక్షించాడు. అక్కడున్న వారి సహాయంతో ఇద్దరినీ రక్షించాడు. అయితే కొద్దిసేపటి తర్వాత అహ్మద్ తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అయితే 10 ఏళ్ల క్రితం అహ్మద్‌కు హార్ట్ సర్జరీ జరిగిందని బంధువులు తెలిపారు. కూతుళ్లను రక్షించిన తండ్రి విషాదకర రీతిలో మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ ఘటన సౌదీఅరేబియాలోని జజన్ నగరంలో జరిగింది.