family-of-swans-wander-

హంస తన కుటుంబంతో రోడ్డు దాటుతుండగా..

వాషింగ్టన్: అప్పటివరకు వాహనాలతో బిజీగా ఉన్న రోడ్డుపై ఒక్కసారిగా వాహనాలు నిలిచిపోయాయి. సాధారణంగా ఎవరైనా విఐపీ ఆ రోడ్డు గుండా వెళ్తుంటే పోలీసులు వాహనాలను నిలిపేస్తారు. అయితే విఐపీ ఎవ్వరూ రాకుండానే ఓ రోడ్డుపై వాహనాలు మెల్లగా వెళ్లడం మొదలుపెట్టాయి. కొంతమంది వాహనాదారులైతే తమ వాహనాలను నిలిపేశారు. అయితే ఇదంతా ఎందుకోసం జరిగిందంటే ఓ హంస తన కుటుంబంతో కలిసి ఆ రోడ్డు గుండా వెళ్తోంది.

దాదాపు గంట సమయంపాటు ఆ రోడ్డుపై హంస తన కుటుంబంతో కలిసి నడుస్తూ వెళ్లింది. అయితే అంత సమయం గడిచిన కూడా వాహనాదారులంతా ఎంతో ఓపికగా వేచి చూశారు. సోమవారం ఉదయం ఏ90 హైవే రోడ్డు వాహనాలతో ఎంతో బిజీగా ఉంటుందని అధికారులు తెలిపారు. అంత సమయం వాహనాదారులు వేచి చూడటం నిజంగా అద్భుతమని వారు వాహనాదారులను ప్రశంసించారు.