Fake-NRIs-fraud-in-OLX

శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద ఘరానా మోసం!

ఓఎల్‌ఎక్స్‌లో కార్లను అమ్మకానికి పెట్టి మోసగిస్తున్న నకిలీ ఎన్నారైలు

హైదరాబాద్, శంషాబాద్‌ :
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కొందరు నకిలీ ఎన్నారైలు ఓఎల్‌ఎక్స్‌లో కార్లను అమ్మకానికి పెట్టి ఘరానా మోసానికి పాల్పడుతున్నట్టు కొంద రు ప్రయాణికులు గురువారం ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఇది సైబర్‌కు సంబంధించిన నేరమని సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించి పంపివేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కొందరు నకిలీ ఎన్నారైలు ఓఎల్‌ఎక్స్‌లో కార్లు అమ్మకానికి పెట్టారని తాము విదేశాల్లో ఉంటామని తమ అకౌంట్‌లో డబ్బులు వేస్తే కార్లను అప్పగిస్తామని వందలాది మంది ప్ర యాణికులను మోసం చేశారని పేర్కొన్నారు.