Explosions-in-gas-pipelines-in-America

అమెరికాలో గ్యాస్‌ పైప్‌లైన్లలో పేలుళ్లు

మూడు నగరాలను ఖాళీ చేయించిన అధికారులు

14-09-2018: అమెరికాలోని బోస్టన్ నగరంలో గ్యాస్ పైపులైన్లలో వరుస పేలుళ్లు సంభవించాయి. దీంతో ఘటన జరిగిన ప్రాంతాలకు సమీపంలోగల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 70 పేలుళ్లు సంభవించాయి. ప్రస్తుతం సంబంధిత అధికారులు గ్యాస్ పైప్‌లైన్‌లలో ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. గ్యాస్ వాసనలు వస్తున్న అన్ని ప్రాంతాలలోని ప్రజలను యద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.