Expat-faces-7-years-jail-if-crime-proved-in-dubai

వలసజీవికి భారీ జైలుశిక్షపడే అవకాశం..కారణమిదే..

దుబాయ్: యూఏఈలోని దుబాయ్ నగరంలో ఓ షాపింగ్ మాల్ పార్కింగ్‌లోని కార్లకు నిప్పు పెట్టిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్లకు నిప్పుపెట్టిన నేరం రుజువైతే నిందితుడికి ఏడేళ్ల జైలుపడే అవకాశం ఉందని పోలీసులు చెపుతున్నారు. ఇదిలావుండగా శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని, ప్రమాదంలో మొత్తం 11 కార్లు దగ్ధమయ్యాయని అధికారులు వివరించారు. నిందితుడు ఆసియాలోని ఓ దేశానికి చెందిన వ్యక్తని, ఉన్నాతాధికారుల ఆధ్వర్యంలో విచారణ జరగుతోందని పోలీసులు వెల్లడించారు. ఓ కారు డ్రైవర్‌తో ఘర్షణకు దిగిన నిందితుడు ఈ చర్యకు పాల్పడ్డాడని ప్రాథమిక సమాచారం అందిందన్నారు. నిందితుడు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందనే సమాచారంతో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
 
భవనం లేదా కార్లను మాత్రమే తగలబడితే ఏడు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తారు. ఎవరైనా ఓ వ్యక్తి మరణిస్తే నిందితుడికి మరణ శిక్ష విధించే అవకాశాలు కూడా ఉన్నాయని  న్యాయవాది అవాతిఫ్ మొహమ్మద్ తెలిపారు.