Enjoy-50-percent-discount-at-UAEs-hypermarkets-for-one-month

బంపరాఫర్... నెల రోజులపాటు 50 శాతం డిస్కౌంట్

అబుదాబి: గల్ఫ్ దేశం యూఏఈ వాసులకు అక్కడి ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ‘వరల్డ్ హ్యాపీనెస్ డే’ను పురస్కరించుకుని నెల రోజులపాటు అన్నీ వినియోగ వస్తువులు, ఆహార పదార్థాలపై 50 శాతం రాయితీ అందించాలని యూఏఈ ఆర్థిక మంత్రిత్వశాఖా నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది. హైపర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్ వ్యవస్థల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రిత్వశాఖా వెల్లడించింది. అల్ బయన్ అనే వార్త పత్రిక ప్రకారం... ఈ డిస్కౌంట్ 51 రోజులపాటు కొనసాగనుందని, గల్ఫ్ వినియోగదారుల రక్షణ దినోత్సవ 13వ వార్షికోత్సవం సందర్భంగా మార్చి 1న ఈ ఆఫర్ మొదలైందని పేర్కొంది. ఆఫర్‌లో భాగంగా దాదాపు 7,500 వస్తువులు తక్కు ధరకే లభించనున్నాయని తెలిపింది. ఈ జాబితాలో కో-ఆపరేటివ్స్‌‌లో లభ్యమయ్యేవి 3000 వస్తువులు కాగా కర్రెఫోర్, లులు స్టోర్స్‌లో దాదాపు 2000 వస్తువులు లభ్యమవుతాయని పత్రిక పేర్కొంది.