:: Welcome to NRI - Article ::

విదేశీ విద్యార్థులకు ఆస్ట్రేలియా ఆంగ్ల ‘పరీక్ష’

సిడ్నీ, అక్టోబరు 12: ఉన్నత చదువులకు ఆస్ట్రేలియా వెళ్లాలని కలలుగంటున్నారా? అయితే.. ఆంగ్లంలో పట్టు సాధించాల్సిందే. ఎందుకంటే.. తమదేశానికి వచ్చే విద్యార్థులకు ఆంగ్ల నిబంధనను మరింత కఠినతరం చేసేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. ఆ దేశ గణాంకాల ప్రకారం ప్రస్తుతం అక్కడ 5.5 లక్షల మంది విదేశీ విద్యార్థులున్నారు. వచ్చే ఏడాది నుంచి తమ యూనివర్సిటీల్లో, వృత్తివిద్యా కళాశాలల్లో చదువుకోవాలనుకునేవారు.. కఠినమైన ఆంగ్ల పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సిందేనని ఆస్ట్రేలియా విద్యా మంత్రి సైమన్‌ బర్మింగ్‌హామ్‌ ప్రకటించారు.