Emirati-not-denied-entry-into-UAE-

అతడిని దుబాయ్‌లో అడుగుపెట్టనివ్వలేదని..

దుబాయ్: థాయ్‌లాండ్ నుంచి దుబాయ్ చేరుకున్న వ్యక్తిని అధికారులు విమానాశ్రయంలో అడుగుపెట్టనివ్వలేదు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో అతడు థాయ్‌లాండ్ వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. ఆ తర్వాత దుబాయ్ వచ్చాడు. అయితే అధికారులు అతడిని దుబాయ్ రానివ్వలేదని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. అది పూర్తిగా అబద్ధమని అధికారులు తేల్చిచెప్పారు. అసలు తమ పౌరుల ఆరోగ్యం విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. వివిధ వ్యాధుల చికిత్స కోసం విదేశాలకు వెళ్లే ప్రయాణికులను తామెన్నడూ అడ్డుకోలేదన్నారు. సోషల్ మీడియాలో ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.