emirates-to-run-extra-planes-for-umrah-rush

రంజాన్ నేపథ్యంలో ‘ఎమిరేట్స్’ ప్రకటన ఇది

దుబాయ్: యూఏఈ కేంద్రంగా సర్వీసులు అందిస్తున్న విమానయాన సంస్థ ‘ఎమిరేట్స్’ రంజాన్ నేపథ్యంలో ఓ ప్రకటన వెలువరించింది. జూన్ 12 నుంచి 24 మధ్య దుబాయ్ నుంచి సౌదీలోని మక్కాకు అదనపు విమానాలను నడపనున్నామని ప్రకటించింది. ప్రార్ధనల కోసం మక్కా వెళ్లే భక్తుల సౌకర్యార్థం మరో 10 వేల మంది ప్రయాణించేలా అదనంగా 24 విమానాలను ప్రత్యేకంగా నడపనున్నామని ఎమిరేట్స్ అధికారులు ప్రకటించారు. రంజాన్ మాసం కావడంతో మక్కాలో పవిత్ర ప్రార్ధనలు నిర్వహించేవారి సంఖ్య అధికంగా ఉంటుందని, భక్తులకు ఇబ్బంది కలగకుండా విమానాలను నడపాలని నిర్ణయించామని, దుబాయ్ నుంచి మక్కాకు నేరుగా విమానాలు నడపనున్నామని ఎమిరేట్స్ అధికారులు సూచించారు.