earthquake-tremors-felt

రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 3.7 మ్యాగ్నిట్యూడ్

దుబాయ్: ఆకస్మాత్తుగా సంభవించిన భూ ప్రకంపనల వల్ల గందరగోళం చెలరేగింది. ఈ రోజు మధ్యాహ్నం గం.12-51నిమిషాలకు స్వల్ప భూకంపం సంభవించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైందని వారు తెలిపారు. భూకంప కేంద్రాన్ని రాస్‌అల్‌ఖైమాకు వాయవ్యంగా దిబ్బ వద్ద గుర్తించామని వారన్నారు. భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు చెబుతున్నారు. అయితే భూప్రకంపనాలు సంభవించడం మాత్రం స్పష్టంగా తెలిసిందని ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.