Duo-rapes-woman-in-Dubai-after-breaking-into-house

మహిళపై ఇద్దరి అత్యాచారం.. భారీ దొపిడీ

దుబాయ్: ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఓ మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం భారీ దోపిడీకి పాల్పడ్డారు. దుబాయ్‌ నగరంలో నివాసముంటున్న పాకిస్తాన్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి మహిళ ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. దొంగతనాలకు పాల్పడడానికి ఆశ్రయమివ్వాలని, సహకరిస్తే దోచుకున్నదాంట్లో భాగం పంచుతామని మహిళకు ఆశ చూపాడు. నిరాకరించడంతో ఆమెపై ఇద్దరు నిందితులు అత్యారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె వద్దనున్న బంగారు నగలు, నగదు, మొబైల్ ఫోన్లు దోచుకున్నారు. మే 6న అల్ మురఖ్వబత్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి వద్ద మొబైల్ ఫోన్ తీసుకున్న బాధిత మహిళ పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరికీ మరో ఐదుగురు యువకులు సహకరించారని, వీరంతా కలిసి మరికొన్ని దొంగతనాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అందరినీ అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేశామని, విచారణ జూలై 7న జరగనుందని తెలిపారు. బాధిత మహిళ ఫోన్ చేసి సమాచారం అందించడంతో నిందితులను పట్టుకోగలిగామని పోలీసులు తెలిపారు. మొత్తం ఏడుగురు ఇంట్లోకి ప్రవేశించారని, ఇంట్లోని వస్తువులను దొంగిలించడంతోపాటు తనపై అత్యాచారం చేశారని బాధిత మహిళ ఫిర్యాదు పేర్కొంది.