Dubais-5-day-mega-sale-kickstarts-today

మెగాసేల్.. ఈ రోజే ప్రారంభం

దుబాయ్: క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల కోసం ఎదురుచూస్తున్న దుబాయ్ వాసులకు గుడ్‌న్యూస్. యూఏఈలోని దుబాయ్ నగరంలో భారీ డిస్కౌంట్ల షాపింగ్ సీజన్ ప్రారంభమయింది. బుధవారం నుంచి ఐదు రోజులపాటు ‘దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్’ ప్రారంభంకానుంది. ‘దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్’లో డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 23, 2018 వరకు సీబీబీసీ క్రిస్మస్ బిగ్గెస్ట్ సేల్ కొనసాగనుంది. ఐదు రోజుల ఈ మెగా సేల్‌లో భారీ డిస్కౌంట్లకు పలు వస్తువులు లభించనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది.  ఏఏ వస్తువులు, ఎంత డిస్కౌంట్ ధరకు లభించనున్నాయనే విషయాలను హాల్ నంబర్ 7, 8 ల వద్ద ప్రదర్శించనున్నారు. ప్రిమడొన్నా, డిజిల్, బాస్, టెడ్ బేకర్, గెస్, బాల్డీ, స్కెచ్చర్‌తోపాటు పలు విలువైన బ్రాండ్ల వస్తువులు లభించనున్నాయి. ఈ బిగ్‌సేల్‌ను బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ప్రారంభించనున్నారని నిర్వాహకులు వెల్లడించారు. దుబాయ్‌లోని ఎన్నారైలూ వీలైతే ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చు.