dubai-announces-new-licence-for-doctors

డాక్టర్ల కోసం కొత్త లైసెన్స్‌ను తెచ్చిన దుబాయ్

దుబాయ్:  యూఏఈ ప్రభుత్వం డాక్టర్లకు తీపికబురు చెప్పింది. ఇకపై డాక్టర్లు దుబాయ్ వచ్చి రెండేళ్లు సేవలందించవచ్చని చెప్పింది. దుబాయ్ హెల్త్ కేర్ అథారిటీ ‘విజిటింగ్ డాక్టర్స్ లైసెన్స్‌’ పేరుతో కొత్త లైసెన్స్‌ను అమలులోకి తీసుకొచ్చింది. ఈ లైసెన్స్‌తో అంతర్జాతీయ డాక్టర్లు, డెంటిస్ట్‌లు, ఇతర ప్రాక్టీషనర్లు రెండేళ్ల పాటు దుబాయ్‌లోని క్లినిక్స్‌లో తమ సేవలను అందించవచ్చు. అంతేకాకుండా ఈ రెండేళ్లలో తమ కుటుంబాన్ని కూడా తీసుకురావచ్చు. లెటర్ ఆఫ్ యాక్సెప్‌టెన్స్ వచ్చిన అనంతరం డాక్టర్లు, దుబాయ్‌లోని ఏదైనా క్లినిక్‌తో కాంట్రాక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చే సదుపాయాన్ని కల్పించారు. దుబాయ్‌ జీవన విధానాన్ని మార్చే యోచనలో తాము ఉన్నామని, అందులో ముఖ్యంగా మెడికల్ రంగంలో పలు మార్పులు చేయదలిచి ఈ లైసెన్స్‌ను అమలులోకి తెచ్చినట్టు యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ చెప్పారు. దీంతో ఇకపై దుబాయ్‌లో అంతర్జాతీయ డాక్టర్లు కూడా తమ సేవలను అందించనున్నారు.