:: Welcome to NRI - Article ::

ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టు ఇదే..!

దుబాయ్: ప్రపంచ దేశాల మధ్య దూరాలను దగ్గర చేసిన విమానయానం లేకుండా నేటి ప్రపంచాన్ని ఊహించడం కష్టం. ప్రపంచంలోని వందలాది విమానాశ్రయాల ద్వారా రోజుకు లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. ఇంతముఖ్యమైన విమానయానం ఏ విమానాశ్రయం నుంచి ఎక్కువగా జరుతోందో తెలుసా?.. అన్నీ విమానాశ్రయాల్లోకెల్లా అత్యంత రద్దీగా ఉండేది మాత్రం దుబాయ్‌ ఎయిర్‌పోర్టేనని నివేదికలు తెలుపుతున్నాయి. ప్రపంచవాణిజ్య కేంద్రమైన దుబాయ్ నుంచే అంతర్జాతీయ ప్రయాణాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. దీంతో రద్దీ పరంగా వరుసగా రెండో ఏడాది కూడా దుబాయ్ ఎయిర్‌పోర్టు అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. 2016లో మొత్తం 83 మిలియన్ల మంది ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణించారని ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్‌నేషనల్, ది ట్రేడ్ అసోసియేషన్ అఫ్ ది వరల్డ్స్ ఎయిర్‌పోర్ట్స్ అధికారులుు ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు. రద్దీ ఎయిర్‌పోర్టుల జాబితాలో దుబాయ్ తర్వాత లండన్, హాంగ్‌కాంగ్, అమ్‌స్టర్‌డామ్, పారీస్, సింగపూర్, ఇంచియాన్, ఫ్రాంక్‌ఫర్ట్, బ్యాంకాక్, తైపీలు వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో అమెరికాకు చెందిన ఎయిర్‌పోర్టులకు చోటు దక్కలేదు. ఇక భారత ఎయిర్‌పోర్టుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

Loading...