Drunk-man-gropes-woman-inside-Dubai-Metro-coach

పూటుగా మద్య సేవించి మెట్రో రైల్లో..

దుబాయ్: పూటుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి రాత్రి 10 గంటల సమయంలో మెట్రో రైలు ఎక్కాడు. మద్యం మత్తులో రైల్లోని ఓ మహిళను లైంగికంగా వేధించాడు. మహిళ నడుముపై చేయి వేశాడు. అసభ్యకరంగా తాకాడు. ఈ పరిణామాలతో తీవ్ర భయాందోళనకు గురైన మహిళ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఈ విషయాన్ని గమనించిన నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ దుబాయ్ పోలీసులు సమయానికి ఘటనా స్థలానికి చేరుకోవడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు నేరానికి పాల్పడ్డానని ఒప్పుకున్న నిందితుడు.. కోర్టులో ఎలాంటి నేరం చేయలేదని బుకాయిస్తున్నాడు. పొరపాటున మహిళకు తన చెయ్యి తాకిందని చెపుతున్నాడు. ఉద్దేశపూర్వకరంగా తనపై చేతులు వేశాడని, అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడని బాధిత మహిళ చెపుతోంది. ఈ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. మార్చి 27కు కేసు వాయిదా పడింది. ఇదిలావుండగా నిందితుడు, బాధితురాలు భారత్‌కు చెందినవారే. నిందితుడి వయసు 30 ఏళ్ల కాగా బాధితురాలి వయసు 27 సంవత్సరాలని పోలీసులు తెలిపారు.