:: Welcome to NRI - Article ::

'అమెరికా ప్రపంచం ముందు తలదించుకోవాల్సి వస్తుంది'

వాషింగ్టన్: ఉత్తరకొరియా ఏం చేసిన ప్రపంచం చాలా ఆసక్తిగా గమనిస్తోందని ఉత్తరకొరియా పత్రిక రోడాంగ్ సింమున్ ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికా స్వాతంత్ర్యదినోత్సవమైన జూలై4న తమ ప్రతాపం అమెరికాతోపాటు ప్రపంచదేశాలకు రుచిచూపించామని తెలిపింది. భవిష్యత్తులో అమెరికా తమతో యుద్ధానికి దిగితే తప్పకుండా ఓడిపోతుందని తెలిపింది. ప్రపంచదేశాల ముందు తలదించుకునే పరిస్థితి వస్తుందని చెబుతోంది. అమెరికాను ఎదిరించే దమ్ముదైర్యం తమ దేశానికి మాత్రమే ఉన్నాయని ఆ కథనం సారాంశం. అయితే అమెరికన్ మీడియా ఈ కథనాన్ని ఖండించింది.

ప్రపంచానికి టెక్నాలజీని పరిచయం చేసిన దేశమే అమెరికా అని, అలాంటి దేశం ముందు మీ కుప్పిగంతులు సాగవని చెప్పింది. ఉత్తరకొరియా, అమెరికా నగరాలను టార్గెట్ చేస్తే తమ దేశం చూస్తూ ఊరుకోదని తెలిపింది. తాము ప్రయోగించిన మిస్సైల్ అలస్కా వరకు చేరుకోగలదని ఉత్తరకొరియా ప్రగల్భాలు పలుకుతోందని హేళన చేసింది. అమెరికా తలుచుకుంటే ప్రపంచ పటంలో ఉత్తరకొరియా కనిపించదని తెలిపింది. అయితే తాము యుద్ధం కోరుకోవడం లేదని, అందువల్ల ఉత్తరకొరియా ఎంత రెచ్చగొట్టిన తమ నాయకత్వం అచితూచి స్పందిస్తోందని తెలిపింది. పిచ్చుకలమీద బ్రహ్మస్త్రలు ప్రయోగించి, తమ దేశం పరువు తీసుకోలేమని చెబుతోంది. తమ మిత్రదేశం దక్షిణకొరియాకు హని కలిగించాలని చూస్తే మాత్రం అమెరికా ఊరుకోదని తెలిపింది. 

Loading...