donot-use-passport-as-address-proof-

పాస్‌పోర్టు అడ్రస్‌ప్రూఫ్‌గా పనికి రాదట..

న్యూఢిల్లీ: పాస్‌పోర్టును అడ్రస్ ఫ్రూఫ్‌గా వాడొద్దని విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా పాస్‌పోర్టు ఆఖరి పేజీలో పాస్‌పోర్టు హోల్డర్ అడ్రస్‌ను ముంద్రించేవారమని భవిష్యత్తులో పాస్‌పోర్టు ఆఖరి పేజీలో హోల్డర్ అడ్రస్ ముంద్రించాలనుకోవడం లేదని అధికారులు తెలిపారు. అందువల్ల పాస్‌పోర్టులను అడ్రస్‌ ఫ్రూఫ్‌గా వాడొద్దని చెబుతున్నామన్నారు. పాస్‌పోర్టు ముందు పేజీలోనే స్కాన్ చేసి పాస్‌పోర్టు హోల్డర్ సంతకంతో కూడిన బార్ కోడ్ ఉంటుందని అందువల్ల అడ్రస్ ముంద్రించేందుకు ప్రత్యేకంగా పేజీ అవసరం లేదని విదేశాంగ శాఖ భావిస్తోందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో  విదేశాంగ శాఖ జారీ చేసే పాస్‌పోర్టులు అడ్రస్ ముంద్రించి ఉండబోదని అధికారులు తెలిపారు.