:: Welcome to NRI - Article ::

'మరోసారి అదే తప్పు చేయొద్దు'

వాషింగ్టన్: 16 సంవత్సరాల క్రితం ఊహించని విధంగా అమెరికా నష్టపోయింది. ఉగ్రవాదులకు దుర్భేద్య ప్రాంతంగా ఉన్న అమెరికాపై దాడి చేసి ప్రపంచానికి ఉగ్రవాదులు సవాలు విసిరారు. మరోసారి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. అని లాస్‌ఎంజీల్స్‌టైమ్స్ ఓ కథనం ప్రసారం చేసింది. వైమానిక దాడుల ద్వారా ట్వీన్ టవర్స్ కూల్చి దాదాపు 3 వేల మంది అమెరికా పౌరుల ప్రాణాలు ఉగ్రవాదులు బలితీసుకున్నారు. మరో 6 వేల మంది క్షతగాత్రులయ్యారు. ఆ రోజు నిజంగా అమెరికా చరిత్రలో దుర్దినం. అలాంటి రోజులు అమెరికా పౌరులు మరోసారి చూడకూడదు.

ఉత్తరకొరియా, అమెరికా మీద అణుదాడి చేస్తే నిజంగా అంతకంటే ఎక్కువ మందే చనిపోతారు. అది ఉగ్రదాడి కన్నా చాలా భయంకరమైనది. దక్షిణ కాలిఫోర్నియాను ఉత్తరకొరియా అణుబాంబులు నాశనం చేసే వీలుందని రాండ్ కార్పొరేషన్ సెంటర్ ఫర్ టెర్రిజమ్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిందని టైమ్స్ గుర్తుచేసింది. గువామ్ వరకు ఉత్తరకొరియా అణుబాంబులు చేరుకోలేవని సైన్యం చెబుతున్నా కూడా కాలిఫోర్నియా ప్రజల్లో భయం మాత్రం వీడలేదని తెలిపింది.

ఇప్పటికే వారు తమ రక్షణ కోసం ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమయ్యారని చెబుతోంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా నాగసాకి మీద వేసిన 'ఫ్యాట్‌మాన్' అణుబాంబు కన్నా, హిరోషిమా మీద వేసిన లిటిల్ బాయ్ కన్నా ఉత్తరకొరియా వేస్తామంటున్న అణుబాంబులు పరిమాణంలో చాలా పెద్దవని అంతేకాకుండా చాలా శక్తివంతమైనవని తెలిపింది. అవి అమెరికా మీద పెను ప్రభావమే చూపుతాయంది. అమెరికా దాడి తర్వాత జపాన్ పరిస్థితి ఏమైందో ప్రత్యక్ష్యంగా తెలిసి కూడా మరోసారి తప్పు జరకుండా చూడాలని కోరింది.

Loading...