:: Welcome to NRI - Article ::

ఉత్తరకొరియా వారిని రానివొద్దు: చైనా హెచ్చరిక

వాషింగ్టన్: ఉత్తరకొరియా కార్మికుల్ని పనుల్లో నియమించుకోవద్దని ప్రజలకు చైనా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అలాగే దక్షిణకొరియా కూడా ఉత్తరకొరియా వలసదారులపై కనికరం చూపెట్టొద్దంటూ కాస్త ఘాటుగానే ప్రజలకు హెచ్చరిస్తోంది. అయితే అధికారిక లెక్కల ప్రకారం దక్షిణకొరియాకు వలస వచ్చిన వారి సంఖ్య గతేడాదితో పోల్చితే 12 శాతం తగ్గిందని యోనోప్ అనే న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

అందుకు కారణం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులేనని ఆ సంస్థ చెబుతోంది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఆగష్టు వరకు వలసవచ్చిన వారు 10 శాతం తగ్గిపోయారంది. గతంలో ఎక్కువ మంది దక్షిణకొరియాకు, చైనాకు వివిధ పనుల కోసం వలసవెళ్లేవారని యోనోప్ తెలిపింది. ప్రస్తుతం అన్ని దేశాలు ఉత్తరకొరియా వలసకార్మికులను రానివ్వడం లేదు. దాంతో ఉత్తరకొరియా వలసదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చైనా ప్రభుత్వం ఏకంగా ఉత్తరకొరియా, చైనా సరిహద్దుల్లో వలసదారులను రావొద్దంటూ సూచిక బోర్డులు ఏర్పాటు చేసిందని యోనోప్ తెలిపింది. అమెరికా కేంద్రంగానే యోనోప్ సంస్థ తన కార్యకలపాలను కొనసాగిస్తోంది.