Donald-Trump-warns-US-to-brace-for-storm

అమెరికాను వణికిస్తున్న ఫ్లోరెన్స్ తుఫాను

 

న్యూయార్క్: 
అమెరికాలో భయంకరమైన ఫ్లోరెన్స్ తుఫాను కరోలినా తీరానికి చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాను కారణంగా గంటకు 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతోపాటు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో అధికారులు తీరప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనినితోడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దక్షిణ కరోలినా, జార్జియో, వర్జీనియా, మియామి, ఫ్లొరిడా రాష్ట్రాల్లోని పలు ముఖ్య ప్రాంతాలపై ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఈ తుఫాను గురించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. పెను విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండి సామాన్య ప్రజలకు అండగా ఉండాలనన్నారు. సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న అధికారులకు భేష్ అంటూ కితాబిచ్చారు.