donald-trump-lawyer-sensational-comments

పోర్న్‌స్టార్‌కు రూ.84 లక్షలు చెల్లించా: ట్రంప్ వ్యక్తిగత లాయర్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది మైకెల్ కోహెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  పోర్న్‌స్టార్ స్టేఫానీ క్లిఫోర్డ్‌కు రూ. 84 లక్షలకుపైగా(1,30,000 డాలర్లు) చెల్లించానని, న్యాయబద్ధంగానే చెల్లించానని న్యూయార్క్ టైమ్స్‌కు తెలిపారు. ఈ భారీ మొత్తాన్ని ట్రంప్ కానీ ఆయన సంస్థలు కానీ తనకు ఇంతవరకూ చెల్లించలేదని అన్నారు.  ఏ కారణంగా చేత ఆమెకు చెల్లించారని ప్రశ్నించగా వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఇదిలావుండగా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవ్వక ముందు పోర్న్‌స్టార్ స్టేపానీతో ఆయనకు లైంగిక సంబంధం ఉందని, ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌కు అడ్డుతగలకుండా ఈ భారీ మొత్తాన్ని చెల్లించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్‌లో కూడా కథనం వెలువడింది. ఈ ఆరోపణలపై న్యూయార్క్ టైమ్స్ ప్రశ్నలు సంధించగా న్యాయవాది కోహెన్ ఈ విషయాలను చెప్పారు. ఇదిలావుండగా ఈ తాజా వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్‌‌ను తీవ్ర విమర్శలపాలు చేస్తున్నాయి.