dollor-matha-temple-in-ahmadabad

ముస్లింల పూజలందుకుంటున్న ‘డాలర్ మాత’

అహ్మదాబాద్: దేశంలో చిత్ర విచిత్రమైన ఆలయాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటి.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు సమీపంలోగల ఝూలాసన్ అనే గ్రామంలో ఉన్న ఆలయం. ఇక్కడకు ముస్లిం మహిళలు తరలివచ్చి పూజలునిర్వహిస్తుంటారు. దీంతో ఈ ఆలయం హిందూ- ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. అంతరిక్ష యాత్రికురాలు సునీతా విలియమ్స్ తండ్రి పూర్వీకుల గ్రామంగా ఝాలాసన్ పేరొందింది. 250 ఏళ్ల క్రితం ఒక ముస్లిం మహిళ ఈ గ్రామాన్ని ఉపద్రవాల నుంచి కాపాడిందట! అందుకే ఇక్కడ ముస్లిం మహిళలు పూజలు చేస్తుంటారు. ఏడు వేల జనాభా ఉన్న ఈ గ్రామానికి చెందినవారిలో 1,500 మంది అమెరికాలో ఉంటున్నారు. ఈ కారణంగా ఆలయంలోని అమ్మవారిని ‘డాలర్ మాత’గా పిలుస్తుంటారు.