discount-offered-in-dubai

60 శాతం డిస్కౌంట్.. అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై

దుబాయ్: ప్రముఖ మొబైల్ కంపెనీ ఎస్టిలాట్ బంపరాఫర్ ప్రకటించింది. అన్ని రకాల లేటెస్ట్ మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై 60 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపింది. వినియోగదారులకు ఇప్పటికే మేసేజ్‌లు పంపించారు. ముఖ్యంగా ఐఫోన్8, ఎక్స్‌లను ఎక్సెంజ్ చేసుకుని కొత్త వాటిని కొనుగోలు చేయొచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తమ అవుట్ లెట్‌లన్నింటిలోనూ ఆఫర్‌లు వర్తిస్తాయని నేరుగా అవుట్‌లెట్‌లకు వచ్చి కొనుక్కోవచ్చని వారు తెలిపారు. అలా రాలేనివారికి ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని వారికి 60 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని వారు చెప్పారు.