:: Welcome to NRI - Article ::

నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్రం మరో అడుగు !

న్యూఢిల్లీ: నల్లధన నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. విదేశాలలో ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు కలిగివున్న భారతీయులకు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం కాస్త ఇబ్బందికరంగా మారనుంది. విదేశాలలో ఉంటున్న భారతీయులు ఆదాయాన్ని ధృవీకరణ పత్రాల్లో విదేశాల్లో ఉన్న వారి బ్యాంకు అకౌంట్లు, ఆస్తిపాస్తుల వివరాలను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధన ఈ ఏడాది నుంచి అమల్లోకి రానుంది. విదేశాల్లో ఉన్న ఆస్తులకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ వివరాలను మాత్రం తప్పని సరిగా తెలియజేయాల్సి ఉంటుంది. తక్కువ కాలం పనిచేయడానికి వెళ్లిన వలసజీవులతో సహా ఉద్యోగాలు చేసే ఎన్నారైలు కూడా వివరాలను తెలిజేయాల్సి ఉంటుంది. నల్లధనాన్ని అరికట్టే చర్యలలో భాగంగా అక్రమ సొమ్ముని పసిగట్టేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఎన్నారైలకు కేంద్రప్రభుత్వం తెలిపిందని డెలోయెట్టే హస్కిన్స్ అండ్ సేల్స్ పార్ట్‌నర్ నీరూ అహుజా తెలిపారు. ఈ నిబంధనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, విదేశాల్లో ఉంటూ నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ఈ నిబంధన ఇబ్బందికరంగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

Loading...