Dh1-million-awarded-to-Indian-road-crash-victim

కేరళ వాసికి 2కోట్ల పరిహారం..

దుబాయి: పుథియా పురియలి సిద్దిక్, కేరళలోని కన్నూర్ నివాసి. దుబాయి వెళ్లి చిన్న కెఫే పెట్టుకుని, సాఫీగా జీవనం సాగిస్తున్నాడు. అయితే 2017 మే 20న ఓ పాకిస్తానీ డ్రైవర్ ఆయన జీవితాన్ని కుదిపేశాడు. వేగంగా కారు నడుపుతూ వచ్చి పుథియాను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పుథియా తీవ్రంగా గాయపడ్డాడు. అతని వెన్నెముక బాగా దెబ్బతింది. మంచానికే పరిమితమయ్యాడు. ఆయన్ను గతేడాది కేరళకు తీసుకెళ్లిపోయారు. అతనికి ముగ్గురు పిల్లలు. కుటుంబంలో అతనే ఉద్యోగం చేసేది. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రమాదంలో గాయపడిన పుథియాకు ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేయగా, ఆ సంస్థ నిరాకరించింది. దీంతో ఈ కేసు దుబాయి కోర్టుకు చేరింది.  ఇరువైపు వాదనలు విన్న కోర్టు, పుథియాకు 1.09మిలియన్ల దీనార్లు (సుమారు రూ.2కోట్లు) చెల్లించాలని ఆ సంస్థను ఆదేశించింది.