Controversial-Video-posted-by-an-emirati-is-detained

భారత్‌కు మద్దతుగా నిలిచారని..ఈ వ్యక్తి ఏం చేశాడంటే..

 

యూఏఈ: ఇండియా, యూఏఈ మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన ఏఎఫ్‌సీ ఏషియన్ కప్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూడటానికి అటు యూఏఈ వారు, ఇటు భారతీయులు ఎగబడ్డారు. అయితే మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు యూఏఈకి చెందిన ఓ వ్యక్తి కొంత మంది భారతీయులను పక్షుల బోనులో బంధించి వారి వీడియో తీసి నెట్‌లో పెట్టాడు. దీన్ని ఖండించిన అటార్ని జనరల్ లీగల్ బంధించిన వ్యక్తిపై యాక్షన్ తీసుకున్నామని, అతనిపై వారంట్ కూడా జారీ చేశామని, అరెస్ట్ చేసి విచారణకు తరలించామన్నారు. వివక్షను తాము సహించబోమని, సమానత్వంపై తమకు నమ్మకమున్నట్టు అటార్ని జనరల్ స్పష్టం చేశారు.
  
కాగా, తాను ఈ వీడియో సరదా కోసం తీశానని, నిజానికి వారందరూ తన దగ్గరే పనిచేసే వాళ్లని యూఏఈ వ్యక్తి అధికారులకు చెప్పాడు. వారిలో 22 ఏళ్లగా తన వద్దే ఉంటూ, తనతోనే కలిసి తినే వారు కూడా ఉన్నరంటూ చెప్పుకొచ్చాడు. వారిని అసలు తాను బంధించలేదని, సహనంపై ఏదో చిన్న వీడియో చేయాలని చేశాను తప్ప ఎటువంటి తప్పు చేయలేదన్నాడు. తనపై వేసిన కేసును కొట్టేయాలంటూ అధికారులను అభ్యర్థించాడు.