china-warsn-donald-trump

డొనాల్డ్ ట్రంప్‌కు చైనా ఘాటు వార్నింగ్ !

బీజింగ్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు డ్రాగన్ దేశం చైనా ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. చైనా దిగుమతులపై అమెరికా వాణిజ్యపరమైన ఆంక్షలు విధించనుందని ట్రంప్ వ్యాఖ్యానించడాన్ని చైనా తప్పుబట్టింది. ఈ వ్యాఖ్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయనున్నాయని హెచ్చరించింది. అమెరికా స్టీల్, అల్యూమినియం ఇండస్ట్రీస్ దెబ్బతినడానికి చైనానే కారణమని, చైనా తయారు చేసిన దిగుమతులపై ఆంక్షలు విధించున్నామని పేర్కొన్న ట్రంప్.. ‘‘ టారీఫ్స్, కోటాలతో సహా అన్ని అంశాలను పరిశీలిస్తున్నాం’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. కుక్క కాటుకు చెప్పుతో సమాధానం చెపుతామని చైనా విదేశాంగశాఖా అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ మీడియాతో అన్నారు. రెండు ప్రధాన ఆర్థిక పోటీదారుల మధ్య ఘర్షణలు సహజమేనని ఆయన అభిప్రాయపడ్డారు.