CHINA-SPACE-STATION-WILL-HIT-

చైనా స్పేస్ స్టేషన్ భూమిని ఢీకొడితే...

వాషింగ్టన్: చైనా స్పేస్ స్టేషన్ ఆ దేశ అధీనంలో లేదని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ స్పేస్ స్టేషన్ భూకక్ష్యలోకి ప్రవేశించిందని ఏదో సందర్భంలో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని కూడా కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఆ స్పేస్ స్టేషన్ ఎక్కడుందో తెలియదు. అయితే నాసా అస్ట్రోనాట్ గినాల్క్ మాసీ దాని జాడ కనుక్కున్నారు. చైనా స్పేస్ స్టేషన్ భూకక్ష్యకు చాలా దూరంలో పరిభ్రమిస్తోందని మాసీ చెబుతున్నారు. అయితే అది భూమిని ఢీకొట్టే ప్రమాదం లేదని ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. అంతేకాకుండా భూకక్ష్యలోకి ప్రవేశించేలోపే అంతరిక్షంలోనే అది మండిపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే భూమిని ఢీకొంటే మాత్రం తప్పకుండా పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్టర్ ద్వారా స్పేస్‌ స్టేషన్‌పై నిఘా పెట్టామని ఆయన తెలిపారు. ఇప్పటికే స్పేస్ స్టేషన్‌లో కొంతభాగం మండిపోయిందని మాసీ చెబుతున్నారు. ఒకవేళ భూమిని ఢీకొనే ప్రమాదం ఏర్పడితే దాన్ని అక్కడిక్కడే ధ్వంసం చేసే అవకాశం ఉందని మాసీ చెప్పారు.