china-have-to-do-more-

'చైనా తీరు బాగోలేదు'

వాషింగ్టన్: ఉత్తరకొరియాకు చైనా అండదండలు ఉన్నంత కాలం ఎన్ని అంక్షలు విధించిన ప్రయోజనం లేదని అమెరికా ఐక్యరాజ్యసమితి రాయబారి నిక్కి హేలీ అభిప్రాయపడ్డారు. పరోక్షంగా ఉత్తరకొరియాకు చైనా సహకరిస్తోందని ఆమె ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పర్యటించినప్పుడు కూడా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉత్తరకొరియాను కట్టడి చేస్తామని అందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారని నిక్కి గుర్తుచేస్తోంది. అయితే కొంతవరకు మాత్రమే చైనా ఆ దిశగా కృషి చేస్తోందని ఆమె అన్నారు. మొత్తంగా చూస్తే ఉత్తరకొరియా కట్టడికి  చైనా చేపడుతున్న చర్యలు ఆశించినంతగా సత్ఫలితాలు ఇవ్వడం లేదని ఆమె పెదవి విరిచారు.