:: Welcome to NRI - Article ::

చైనా చేస్తోన్న పని ఇది..

వాషింగ్టన్: ఉత్తరకొరియాతో వ్యాపార సంబంధాలను తెంచుకుంటున్నామని చైనా గతంలో ప్రకటించింది. అయితే ఈ సంవత్సరం మూడవ క్వాటర్(జనవరి-సెప్టెంబర్) ముగిసే వరకు ఉత్తరకొరియాతో చైనా వ్యాపారాల విలువ 20.9 శాతం పెరిగిందని అమెరికా మీడియా తెలిపింది. ఇది చైనా ద్వందనీతికి నిదర్శమని అమెరికా మీడియా విమర్శలు గుప్పిస్తోంది. చైనాకు ఉత్తరకొరియా నుంచి దిగుమతయ్యే వస్తువులు మొత్తం 16.7 శాతం పెరిగిందని అమెరికా మీడియా తెలిపింది. అయితే చైనా చేస్తోన్న పనుల అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని మీడియా తెలిపింది.