Chandrababu-America-tour-from-September-22

22న అమెరికాకు సీఎం చంద్రబాబు

ప్రకృతి సేద్యంలో.. 5 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తి!

అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): సహజ, ప్రకృతి సేద్యంలో నాలుగేళ్లలో 5 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులను సాధిస్తామని అమెరికా వేదికగా సీఎం చంద్రబాబు వెల్లడించనున్నారు. ఈ నెల 22న ఆయన అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. వర్తక, వాణిజ్య ఒప్పందాలపై ద్వైపాక్షిక, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను నిర్వహించడంతో పాటు.. రాష్ట్రంలో ప్రకృతి సేద్యంలో అవకాశాలపై అమెరికాలోని వర్తక, వాణిజ్య బృందాలకు వివరించనున్నారు. ఈ నెల 24న ‘సుస్థిర వ్యవసాయాభివృద్ధిలో ప్రపంచంలో ఎదురువుతున్న సవాళ్లు-ఏపీలో శూన్య బడ్జెట్‌లో సహజ వ్యయసాయాభివృద్ధి విధానాలు’ అనే అంశంపై యూఎన్‌ఈపీ ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు కీలక ఉపన్యాసం చేస్తారు. 25న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం-ఏపీ ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు సంయుక్తంగా ఏర్పాటు చేసే రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. 26న కొలంబియా వర్సిటీలో ‘గవర్నెన్స్‌ ఇన్‌ ద ఏజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ అనే అంశంపై ప్రసంగిస్తారు.