:: Welcome to NRI - Article ::

పిల్లి ప్రాణాలను రక్షించడానికి కదిలిన యంత్రాంగం

అబుదాబి: నగరంలో రద్దీగా ఉండే ఓ రోడ్డుపై ఓ పిల్లి పిల్ల  చిక్కుకుంది. రోడ్డుపై ఎటు కదిలినా ప్రాణాలను కోల్పోయే స్థితిలో ఉందని ఆపరేషన్ రూం సమాచారం అందుకుంది. డైరెక్టర్ జనరల్ అఫ్ అబుదాబి సివిల్ డిఫెన్స్ మహమ్మద్ జలీల్ అన్సారీ రంగంలోకి దిగారు. వెంటనే ఆ రోడ్డుపై ఎలాంటి వాహనాలు తిరగకూడదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఓ బృందాన్ని ఘటనా స్థలానికి పంపించి పిల్లి పిల్లను సురక్షింగా పట్టుకున్నారు. పిల్లిని అక్కడి నుంచి తీసుకెళ్లిన అనంతరం రోడ్డుపై వాహనాలను అనుమతించారు. పిల్లిని పట్టుకునే సమయంలో తీసిన వీడియో ఆన్‌లైన్‌లో పోస్టు చేయగా మంచి స్పందన వచ్చింది. పిల్లి ప్రాణాలను రక్షించడానికి సిబ్బంది తీసుకున్న చర్యలు బాగున్నాయని పలువురు నెటీజన్లు మెచ్చుకుంటున్నారు. సిబ్బంది, అధికారులను పొగుడుతున్నారు. ఆమేజింగ్ వరల్డ్ వారి సౌజన్యంతో ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి

Loading...