:: Welcome to NRI - Article ::

రూంమేట్‌ను హత్య చేసి.. ఇలా నాటకం ఆడాడు

దుబాయ్: భారతదేశం నుంచి దుబాయ్‌కి వలసవెళ్లిన ఇద్దరు వ్యక్తులు వడ్రంగి పని చేస్తున్నారు. ఇద్దరూ ఒకే రూంలో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో 56 ఏళ్ల వయసున్న వ్యక్తి తన రూంమేట్‌పై పగ పెంచుకున్నాడు. నిద్రిస్తున్న సహచరుడిపై దారుణంగా దాడి చేశాడు. రూంలోని అట్లపెనాన్ని తీసుకుని తల, ముఖంపై విచక్షిణా రహితంగా కొట్టాడు. దీంతో బాధితుడి ముఖం గుర్తుపట్టలేనంతగా తయారైంది. అంతేకాకుండా వంటగదిలో ఉన్న కత్తిని తీసుకుని విచక్షిణా రహితంగా పొడిచాడు. హత్యానంతరం భయపడిన నిందితుడు తనను తాను కత్తితో పొడుచుకుని హాస్పిటల్లో చేరాడు. తమపై ఎవరో దాడి చేశారని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసు విచారణలో నిజాలు బయటపడ్డాయి. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా నిజాలను ఒప్పుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా చంపలేదని, మృతిచెందిన వ్యక్తి, అతడి సన్నిహితులు తనకు విషం పెట్టి చంపాలని ప్రయత్నించారని అందుకే చంపాల్సి వచ్చిందని కోర్టుకు తెలియజేశాడు. విచారణ పూర్తవ్వకపోవడంతో మే 11కు కేసును వాయిదా వేశారు. నిందితుడి వాదనలను వినిపించడానికి ఓ న్యాయవాదిని నియమించారు.  

Loading...