car-plunges-down-a-hillside

కారు బంతిలా పల్టీలు కొట్టి.. చివరికి

వాషింగ్టన్: ఓ వ్యక్తి దారుణం చేశాడు. తన భార్యను కారులో ఎక్కించి ఆ కారును కొండ చివర నుంచి కిందకు తోసేశాడు. కారు బంతిలా దొర్లుకుంటూ వచ్చి కొండ దిగువన ఉన్న రిజర్వాయర్‌లో పడిపోయింది. ఈ ఘటనను అతడు వీడియో కూడా తీశాడు. తరువాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోలీసులు వీడియో ఆధారంగా కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

బుధవారం రిజర్వాయర్‌లో పోలీసులు గాలింపు చేపట్టారు. ముందుగా కారు కనిపించింది. మరికొద్దిసేపటికే కారు అడుగున మహిళ మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారమే భర్త తన భార్యను హత్య చేశాడని పోలీసులు తేల్చారు. అందుకోసం విహరయాత్ర పేరుతో ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.