:: Welcome to NRI - Article ::

విమానంలో ఎయిర్‌హోస్టెస్ కంగుతినే పని..12 సెకన్ల వీడియో

దుబాయ్: ఓ విమాన సిబ్బంది చేసిన నిర్వాకం వీడియో రూపంలో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. విమాన సిబ్బంది నిబద్ధతో పని చేస్తారని, విమానంలో సేవలు అద్భుతంగా ఉంటాయని భావించిన వారికి ఈ వీడియో చూస్తే దిమ్మతిరగడం ఖాయం. దుబాయ్ నగరం నుంచి బార్సిలోనా వెళ్తున్న ఓ విమానంలో ఓ ఎయిర్‌హోస్టెస్ ఖాళ్లీ బాటిల్లో మిగిలిపోయిన మద్యాన్ని నింపుతూ కనిపించింది. ఈ దృశ్యాన్ని ఓ ప్రయాణికుడు సెల్‌ఫోన్‌తో చిత్రీకరించాడు. వీడియోని ఆన్‌లైన్‌లో పోస్టు చేశాడు. దీంతో వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోని విమానంలోని బిజినెస్ క్లాసులో చిత్రీకరించినట్లు స్పష్టమవుతోంది. ఈ ఘటనపై ఎమిరేట్స్ విమాన సంస్థకు చెందిన ఓ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. సంస్థలో ఇలాంటి పనులు జరగడానికి వీలులేదని, ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఈ వీడియో చూసిన వారు కంగుతింటున్నారు. వీడియో చూస్తే విషయం మీకే అర్థం అవుతుంది.