Bullets-in-bag-at-airport

విమానాశ్రయంలో బుల్లెట్‌ కలకలం

ఓ ప్రయాణికుడి లగేజీలో లభ్యం

శంషాబాద్‌, హైదరాబాద్:  విమానాశ్రయంలో శనివారం రాత్రి బుల్లెట్‌ కలకలం సృష్టించింది.  విమానాశ్రయం నుంచి తిరుపతి వెళ్తున్న విమానం ఎక్కడానికి వెళ్తున్న ప్రయాణికులను ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అయితే చిత్తూర్‌కు చెందిన కాటంరెడ్డి కూడా ఇదే విమానంలో వెళ్లడానికి ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అతని లగేజీ తనిఖీ చేస్తుండగా అందులో బుల్లెట్‌ దొరికింది. దీంతో ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది వెంటనే ఎయిర్‌పోర్టు పోలీసులకు సమాచారం అందించి నిందితుడిని విచారణ నిమిత్తం ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిని విచారిస్తున్నట్టు ఎస్సై శివకుమార్‌ తెలిపారు.