Brothel-Owning-Republican-Who-Died-Last-Month-Wins-Elections

చనిపోయినా గెలిచాడు!

నెవడా అసెంబ్లీకి వేశ్యాగృహ యజమాని ఎన్నిక
నెవడా, నవంబరు 8: అమెరికాలో నెవడా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అక్కడి ప్రసిద్ధ వేశ్యాగృహం యజమాని డెన్నిస్‌ హోఫ్‌ (72) భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. అయితే చనిపోయిన తర్వాత ఆయన విజయం సాధించడమే ఇక్కడ విశేషం. 36వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్‌ నుంచి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన హోఫ్‌.. వీకెండ్‌ మొత్తం తన జన్మదిన వేడుకలు జరుపుకొన్న ఆయన.. గత నెల 16న తన నివాసంలో మరణించారు. నెవడా రాష్ట్ర చట్టం ప్రకారం అభ్యర్థి చనిపోయినా ఓటింగ్‌ జరుగుతుంది. అతడు విజయం సాధిస్తే అతడి స్థానంలో ఆ గెలిచిన పార్టీ వ్యక్తినే ఎన్నికల సంఘం అసెంబ్లీకి పంపుతుంది. హోఫ్‌ ఈ ఎన్నికల్లో ఏకంగా 68.3 శాతం ఓట్లు సాధించడం విశేషం. ఆయనపై పోటీచేసిన విద్యావేత్త లెసియా రొమనోవ్‌ 31.7% ఓట్లు మాత్రమే పొందారు. అమెరికాలో చట్టబద్ధంగా వేశ్యాగృహాలు నడిచేది ఒక్క నెవడా రాష్ట్రంలోనే. హోఫ్‌ ఐదు వేశ్యాగృహాలకు యజమాని.