:: Welcome to NRI - Article ::

ఆకాశంలో జన్మించాడు..

విమానంలో ప్రసవించిన మహిళ

న్యూఢిల్లీ, జూన్‌ 18: సౌదీ అరేబియా నుంచి భారతకు వస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలోకి గగనతలంలో ఊహించని అతిథి వచ్చాడు. జీవితాంతం ఈ సంస్థ విమానాలలో ఉచితంగా ప్రయాణించేలా బర్త్‌ డే కానుక అందుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో డమ్మమ్‌ నుంచి కోచికి బయల్దేరిన ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీకి అత్యవసర వైద్యసేవలు అవసరమయ్యాయి. దీంతో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. విమానం అరేబియా సముద్రం గగనతలంపై 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగానే.. సిబ్బంది, తోటి ప్రయాణికురాలైన ఓ నర్సు సాయంతో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. వీరిద్దరూ క్షేమంగా ఉన్నారు.