body-of-a-labourer-bring-from-dubai,-jay-panda-pays-tribute

చనిపోయిన 11 రోజుల తర్వాత..

కేంద్రపార: గత నెల 31న దుబాయ్‌లో మరణించిన దుషాషన్ పాత్ర మృతదేహం భారత్‌కు చేరుకుంది. భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు దుషాషన్ శవాన్ని తీసుకొచ్చారు. కేంద్రపార మాజీ ఎంపీ జే పాండా ఎయిర్‌పోర్టుకు వచ్చి సంతాపాన్ని ప్రకటించారు. లక్షలాది మంది ఒడిశా యువకులు పొట్టకూటి కోసం సొంత రాష్ట్రాన్ని, దేశాన్ని వదిలి వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశా ప్రజలు ఎక్కడికీ వెళ్లకుండా సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకోవాలనేది తన కోరికని ఆయన తెలిపారు. దుషాషన్ ఎనిమిది నెలల క్రితం ప్లంబర్‌గా పనిచేయడం కోసం దుబాయ్ వెళ్లాడు. 11 రోజుల క్రితం గుండెనొప్పితో దుషాషన్ అక్కడే మరణించాడు. తనతో పాటు పనిచేస్తున్న ఓ వ్యక్తి దుషాషన్ మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు.