:: Welcome to NRI - Article ::

భారతీయుల డబ్బు స్విస్‌ బ్యాంకుల్లో లేదు

అక్కడి ప్రైవేటు బ్యాంకుల ప్రకటన

న్యూఢిల్లీ, జూన్‌ 18: నల్లధనం అనగానే అందరికీ గుర్తొచ్చేది స్విస్‌ బ్యాంకులే. లెక్కాపత్రం లేని సొమ్మును దాచే చోటు అదేనన్నది తెలిసిందే. కానీ, భారతీయుల డబ్బు భారీగా పోగుపడింది మాత్రం ‘స్విస్‌’లో కాదట. సింగపూర్‌, హాంకాంగ్‌ వంటి చోట్ల దాచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారట. ఈ విషయాన్ని స్విస్‌ ప్రైవేటు బ్యాంకుల సంఘం తెలిపింది. స్విస్‌ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న భారతీయుల వివరాలు తెలిపేందుకు ఆ దేశంతో భారత ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే అక్కడి బ్యాంకులు ఈ ప్రకటన చేయడం గమనార్హం.