Beauty-queen-leave-the-country

దేశం విడిచి పారిపోయిన బ్యూటీ క్వీన్

దేశం విడిచి పారిపోయిన బ్యూటీక్వీన్

బాగ్దాద్, 12-Oct-2018: ముస్లిమ్ అందాల రాణి, మాజీ మిస్ ఇరాక్ షిమా ఖాసిం అబ్దుల్ రహమాన్ ఇరాక్ దేశం వదిలి జోర్డాన్ దేశానికి పారిపోయింది. 2015లో మిస్ ఇరాక్ గా అందాలరాణి కిరీటాన్ని దక్కించుకున్న షిమా ప్రముఖ మోడల్. మోడల్ అయిన అందాల రాణి షిమాను చంపేస్తామని ఇస్లామిక్ స్టేట్ కార్యకర్తలు హెచ్చరించడంతో ప్రాణభయంతో ఆమె స్వదేశం విడిచి వెళ్లిపోయింది. ‘‘నన్ను హతమారుస్తామని చాలామంది బెదిరించారు....నా జీవితం ప్రమాదంలో పడింది...నేను సౌకర్యవంతంగా జీవించేందుకే ఇరాక్ వదిలి జోర్డాన్ వచ్చాను’’ అని షిమా చెప్పారు. బాగ్దాద్ లో సోషల్ మీడియా మోడల్ ను తీవ్రవాదులు కాల్చి చంపిన ఘటన అనంతరం షిమా ప్రాణాలు కాపాడుకునేందుకు దేశం వదిలి జోర్డాన్ పారిపోయింది.